కొలుపులు ఎలా చేస్తారు

కొలుపులు మొదలు పెట్టిన రోజు ఉయాన్నే భక్తులు అందరూ కలిసి దేవాలయానికి చేరుకుని అక్కడ నుంచి అమ్మవారి విగ్రహం అలాగే అమ్మవారి ఆభరణాలు వస్తువులు.

 తీసుకుని నది స్నానం చేయించి అమ్మవారి విగ్రహం
 అమ్మవారి ఆభరణాలు అన్నిటినీ నదిలో స్నానం చేయించి.... 
తదుపరి నది తీరంలో ఒక ప్రదేశంలో అమ్మవారి విగ్రహం ఉంచి
 అక్కడ నుంచి అమ్మవారి విగ్రహం వెంట వెళ్లిన భక్తులు అందరూ కూడా నదిలో స్నానం చేసి అనంతరం  అమ్మవారికి పసుపు కుంకుమ పూలను అమ్మవారి విగ్రహం వద్ద ఉంచి
  పూజాది కార్యక్రమం నిర్వహించి అనంతరం మేళతాళాలు తప్పెట వాయిద్యాలతో మొదలు పెట్టుకుని రావడం...

ఊరేగింపు కార్యక్రమం

         అమ్మవారి విగ్రహం కొన్ని చోట్ల విగ్రహాన్ని మోయడం జరుగుతుంది
 అది కూడా కొంత మంది సొంత కుటుంబీకులు
  మరికొంత మంది విగ్రహ దాతలు ఎవరు అయినా ఉంటే వారు మాత్రమే మోయడం జరుగుతుంది..
  ఊరేగింపు మొదలు ఇక్కడ నుంచి మొదలవుతుంది 


పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి పసుపు కుంకుమ లు చల్లుకుంటూ ఎంతో సరదాగా  గ్రామ పురవీధుల్లో ఊరేగించి అనంతరం దేవాలయంలో పెట్టడం జరుగుతుంది...