కొలుపులు అంటే  ఏమిటి అసలు ఎటువంటి  కార్యక్రమాలు  నిర్వహిస్తారు

 


 కొలుపులు 

   
         గుడి నిర్మాణం అనంతరం మొదట నిర్వహించిన రోజులు మరయూ
ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించుదాం అని
తీసుకునే  నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది...

           కొలుపులు నిర్వహణ 

                    అమ్మవారి కొలుపులు మొదలు
ఏ ఊరులో  అయితే గుడి నిర్మించుకుంటామో
ఆ ఊరిలో వున్న దేవాలయాలు అమ్మవారి గుడులు  ఇంకా వేరే దేవర ఆలయాలు ఉంటే అక్కడకు  ఆడపడుచులు మేళతాళాలతో  వెళ్లి  ఆహ్వానించి రావాలి
 ఈ కార్యక్రమాన్ని అనకట్టడం  అంటారు.....

 అణకట్టడం ఎలా ఏమి చేస్తారు 

      అంమ్మవారి కి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ
అలాగే పూలు పళ్ళు తీసుకుని
 ప్రతి గుడి వద్దకు వెళ్లి అమ్మవారి వద్ద పసుపు కుంకుమలు ఉంచి
 తల్లి  మా దేవర  కొలుపులు నిర్వహిస్తున్నాము
 దయచేసి మీరు అందరూ వచ్చి
ఈ కొలువుల లో పాల్గొని ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సక్రమంగా జరిపి
మీ అందరి దీవెనలు మాకు అందించండి అని ఆహ్వానిచడం .....