వినాయక చవితి శుభాకాంక్షలు



ఈరోజు అనగా ఆగస్టు22వ తేది 
అతి పెద్ద పండుగ
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని
 వినాయక చవితి 

 మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర|
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే||

  కార్యక్రమం:-

      ప్రతి సంవత్సరం వినాయక చవితి అనగానే 
ప్రతి పల్లెలోనూ పట్టణాల్లో ఎంతో సంతోషంగా నెలరోజుల ముందు నుంచి
 యువత అందరూ కలిసి ఒక చోట చేరి
 అక్కడ వినాయక చవితి సంభరాల ఎలా చేద్దాం ఎంటి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసి 
ఆ ప్రణాళిక ప్రకారం విధుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఛందాలు సేకరించి 
పండుగ ముందు రోజు పందిరి వేసి  పండుగ రోజు బొమ్మను తెచ్చి పెడతారు.... 

పూజా విధానం:- పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి
 పత్రి మామిడాకులు అరటి చేట్లు అరటి పిలకలు 
ఇలా 12లేదా 21 రకాల పత్రి సేకరించి 
 పందిరి లోని వినాయకుని విగ్రహం వద్ద పూజ మరియు వ్రత పుస్తకం చదివి  
 ఆ విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యం సమర్పించి 
అనంతరం వచ్చిన భక్తులకు  ప్రసాద వితరన జరుపుతారు. 
ఇదే విధంగా కొంత మంది 1రోజు మరికొందరు 9నవరాత్రి రోజులు పూజలు నిర్వహిస్తారు అనంతరం 

నిమర్జన కార్యక్రమం:-

    నవరాత్రి పూజల అనంతరం  మేళతాళాలలతో రంగులు చల్లుకుంటూ  కోలాహలం తొ వెళ్లి తల్లి గంగమ్మ ఒడిలోకి పంపడం జరుగుతుంది.. ఈ విధంగా వినాయక చవితి
సంభరాలు నిర్వహిస్తారు...

నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా!!